ఢిల్లీ బయలు దేరిన ఆదివాసీలు
గుడిహత్నూర్: సెప్టెంబర్, 20( జనంసాక్షి)లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తోలగించాలని డిమాండ్ చేస్తు 22న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నా కు మండలం నుండి వివిధ ప్రైవేట్ వాహనాలలో ఆదివాసి సమాజ పెద్దలు, సంఘ నాయకులు, ఆదివాసి పటేళ్లు బుధవారం ఢిల్లీ బయలు దేరారు ముందుగా మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రక్కన గల కుంరం భీం విగ్రహనికి ఆదివాసి సంప్రదాయాల ప్రకారంపూజాలు నిర్వహించారు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన జిల్లా అధ్యక్షుడు రాయిసిడం జంగు, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేందోర్ జలపతి, ఆదివాసి సమాజ పెద్దలు ఆత్రం భీంరావ్ , పేందోర్ మారుతిరావు, మడవి నాగోరావ్,కుంర రాజు, సోయం దస్రు, కుంర లింగు, సోయం సుదర్శన్,మేస్రం జంగు, మేస్రం ఫోల్లు, ఆర్క నాగోరావ్, పంద్ర మానిక్ రావు,వేడ్మ నాగ్ నాథ్, సోమం రాము,కినక యాదోరావు తదితరులు ఉన్నారు




