చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ వస్తువులను సద్వినియోగం చేసుకోండి
-చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించండి మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ కుమార్
వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 20 జనం సాక్షివికారాబాద్ పట్టణంలో చేనేత హస్తకళ వస్తువులను కొనుగోలు చేసుకుని చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ కుమార్ పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ క్లబ్బులో ఏర్పాటుచేసిన చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ ప్రదర్శననుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ హ్యాండ్లూమ్ చేనేత వస్తువులను కొనుగోలు చేసుకుని చేనేత కార్మికులకు కేతివృత్తుదారులకు బాసటగా నిలవాలని ఆమె సూచించారు ప్రభుత్వం అనేక సంకేమ పథకాలు ప్రవేశపెట్టి చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటిక చేనేత కార్మికులు చేసిన చేతివృత్తులకు సరి అయిన ఆచరణ లేక అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం రాయితీలతో అందిస్తున్న చేనేత వస్తువులు హైడ్ లూమ్ వస్తువులు చేతివృత్తులపైనే ఆధారపడి ఉన్నందున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె శృతించారు ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ భరత్ మండల్ ఉమా చరణ్ శ్యాము రాణి కుమారి నర్సింలు అవినాష్ మనోజ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు




