Tuesday, 3 November 2026

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం-టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి సెప్టెంబర్ 20 ఎల్ఎల్ఆర్‌ల పంపిణీ చేసిన చింతా ప్రభాకర్తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం అనిటీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు బుధవారం సంగారెడ్డి లోని చింత ప్రభాకర్  ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ అందజేశారు సంగారెడ్డి పట్టణంలోని రామ్ నగర్ లో ఉచిత లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ చేశారుచింతా ప్రభాకర్ గారికి రామ్ నగర్ కాలనీ సభ్యులు ఘన స్వాగతం పలికి ,శాలువాతో సన్మానించారుఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూలర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ లైసెన్స్‌ అందించడమే తన లక్ష్యం అన్నారుడ్రైవింగ్‌ వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా లైసెన్స్‌ ఇప్పించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం అనితెలంగాణలోని సంక్షేమం ,అభివృద్ధి ఇతర రాష్ట్ర ప్రజలు కోరుతున్నా రూ అన్నారు సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు , మీ మద్దతు ఆశీర్వాదం ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సి.డి.సి చైర్మన్ విజేందర్ రెడ్డి ,పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు ,కార్యదర్శి నర్సింలు, నాయకులు జైపాల్ రెడ్డి ,సర్పంచ్ గోపాల్ రెడ్డి , జీవి శ్రీనివాస్ , టిఆర్ఎస్ నాయకులు అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు