Thursday, 5 November 2026

చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకు బహుజనులు ఏకం కావాలి- బీఎస్పీ జనగామ జిల్లా అధ్యక్షులు బస్వగల్ల సిద్దయ్య

-11వ రోజు దీక్షల్లో కూర్చున్న బీఎస్పీ నాయకులు

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 21 : చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం బహుజనులు ఏకమై రెవెన్యూ డివిజన్ సాధించేంతవరకు పోరాటం కొనసాగించాలని బీఎస్పీ జనగామ జిల్లా అధ్యక్షులు బస్వగల్ల సిద్దయ్య కోరారు. గురువారం జేఏసి ఆధ్వర్యంలో చేర్యాల పాత బస్టాండ్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరాయి. ఈదీక్షల్లో బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ నాయకులు కూర్చోగా వారికి జేఏసీ చైర్మన్ రామగళ్ల పరమేశ్వర్,కో చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి హాజరై దీక్షలను ప్రారంభించారు. ఈసందర్భంగా బీఎస్పీ అధ్యక్షులు బస్వగల్ల సిద్ధయ్య మాట్లాడుతూ.. చేర్యాల ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా బహుజనులు అంతా ఏకమై చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసేంతవరకు ఈ ప్రాంత బిడ్డలుగా ప్రతి ఒక్కరు రెవెన్యూ డివిజన్ ఉద్యమంలో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీక్షలకు సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, జేఏసీ మండల నాయకులు మిట్టపల్లి నారాయణ రెడ్డి, కొంగరి వెంకట్ మావో, బిజ్జ రాము, చందా శ్రీకాంత్, అంబటి అంజయ్య గౌడ్, మంద మల్లారెడ్డి, కురారం బాలనర్సయ్య, బండకింది అరుణ్ కుమార్,కూరేళ్ల యాదగిరి, కాశెట్టి ఆంజనేయులు, పచ్ఛిమడ్ల వెంకటయ్య, అంబాల రాములు, మ్యాక యదయ్య తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈదీక్షల్లో బీఎస్పీ ధూళిమిట్ట మండల అధ్యక్షుడు గుండె ఉదయ్ కుమార్, చేర్యాల మండల కార్యదర్శి మెరుగు రమేష్, చేర్యాల పట్టణ అధ్యక్షులు రామగల్ల శ్రావణ్, ముస్త్యాల రాజేష్, బస్వగల్ల నవీన్, కొండ్ర మల్లేష్, భూమిగారి మధుకర్, మల్లిగారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.