Thursday, 5 November 2026

బలగం సినిమా నటులకు ఘన సన్మానం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 21 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గం రంగసాయిపేట లోని శ్రీ సాయి నగర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆడే పు రవీందర్ ఆధ్వర్యంలో బలగం సినిమాలో నటించిన జీవిబాబు మరియు వేముల ప్రభాకర్ సందడి చేశారు. బలగం సినిమాలోని డైలాగులను చెబుతూ భక్తులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వారి ఇరువురిని స్థానిక 42వ డివిజన్ గుండు చందన పూర్ణచందర్ కాలనీ అధ్యక్షులు రామానుజం జగదీశ్వర్ స్వామి అసోసియేట్ అధ్యక్షులు మెంతుల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి అనుమాండ్ల రమేష్ నారాదాసు చందర్ ఘనంగా సన్మానించి సినిమాలో వారు చేసిన పాత్రలను అభినందించినారు. ఈకార్యక్రమంలోబండారి సోమయ్య బొల్ల బోయిన మల్లికార్జున్ అనుమాండ్ల ప్రభాకర్ ఎదులాపురం నరసింహ చారి పూజారి రాజేశ్వరరావు పొడిశెట్టి శ్రీనివాస్ కావటి కర్ణాకర్ సాంబమూర్తి మరియు వేముల వాణిశ్రీ విద్య పద్మశ్రీ రజిత స్రవంతి శ్రీలత మంజుల రమా తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కావటి కరుణాకర్ మమత ల కుమార్తె చిన్నారి వేదశ్రీ చేసిన భరతనాట్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది