శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.
శ్రీ లక్ష్మీ గణపతి ని దర్శించుకున్న పట్టణ ప్రముఖులు.
తాండూరు సెప్టెంబర్ 21(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం సీసీఐ కాలనీలో ప్రతి ష్టాపించిన శ్రీలక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో అన్నదానకార్యక్రమం నిర్వహించా రు .గురువారం తాండూర్ పట్టణం సీసీఐ కాలనీలో ప్రతిష్టాపించిన శ్రీ లక్ష్మీ గణపతి
ని దర్శించుకునేందుకు సీనియర్ నాయకులు సాయిపూర్ పట్లోళ్ల నర్సింలు,బంటారం సుధాకర్, పరిమళ, సాహూ శ్రీలత, పట్టణ ప్రముఖులు కాలనీవాసులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవా కమిటీ ఆధ్వర్యంలో అన్నదాత పి వెంకటేష్ ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాస్ చారి, లక్ష్మయ్య, సుబ్బారావు వెంకటసుబ్బయ్య, మరియు జావీద్ అనిల్ బాండ్,ఆదినారాయణ, యాదగిరి రఘునందన్ రాఘవేందర్, శేఖర్, ప్రవీణ్ రెడ్డి, , నవీన్ తోపాటు కాలనీవాసులు మహిళలు తదితరులు ఉన్నారు.




