కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలో నే అగ్రస్థానం
-384 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
-రాష్ట్రంలో సమాంతరంగా సంక్షేమం, అభివృద్ధి
-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి బ్యూరో సెప్టెంబర్21 (జనంసాక్షి)కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నే అగ్రస్థానంలో నిలిచిందనిరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిఅన్నారు.గురువారం నాడు వనపర్తి జిల్లా కేంద్రంలో నిమంత్రి క్యాంపు కార్యాలయంలో 384 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 106 మంది లబ్దిదారులకు రూ.42.50 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు, అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ లోసమాంతరంగా సంక్షేమం, అభివృద్ధి చేస్తన్నామని కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, అమ్మవడి, న్యూట్రిషన్ కిట్, ఆసరా ఫించన్లలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.సంక్షేమ గురుకుల పాఠశాలలతో విద్యారంగ స్వరూపమే మారిపోయిందని, కేసీఆర్ కిట్, నూతన వైద్య కళాశాలలతో వైద్యరంగ స్వరూపమే మారి ఆరోగ్య తెలంగాణ కు బాటలు వేశామని తెలిపారు.తెలంగాణ ఆసుపత్రులు కాన్పులలో రికార్డులు సృష్టిస్తున్నానమని పేద ,మధ్య,ధనిక తేడాలేకుండా వైద్య సదుపాయాలు అందిస్తున్నమని చెప్పారు.మన ఊరు – మన బడి కార్యక్రమంతో విద్యారంగo లో పెను మార్పులు చేసి విద్యను అందిస్తున్నమని వివరించారు.ఆపన్నులకు అండగా నిలిచేందుకే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా,
పేద, మధ్యతరగతి వర్గాలకు సర్కారు సాయంతో ఊరట లభిస్తుందని అన్నారు.
తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమం, ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచాలని కోరారు. లబ్ధిదారుల తో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మండల భారాస అధ్యక్షుడు మాణిక్యం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




