Thursday, 5 November 2026

26,27 తేదీల్లో మెగా ఉద్యోగమేళా

హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): బి2బి ఇన్ఫర్మేషన్‌ పోర్టల్‌ ట్రేడ్‌ హైదరాబాద్‌ డాట్‌కామ్‌ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగమేళా చేపట్టారు. ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో మహా ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ఈ జాబ్‌ మేళాలో 120కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని ట్రేడ్‌హైదరాబాద్‌ సీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంధన, సౌర, మొబైల్‌, హాస్పిటాలిటీ, సివిల్‌, మెకానికల్‌, కన్‌స్టక్షన్ర్‌, జువెలరీ, ఆరోగ్య సేవలు, బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, ఆటోమొబైల్‌ సహా ఇతర రంగాలకు చెందిన కంపెనీలు ఈ మేళాలో దాదాపు 35 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయని చెప్పారు.