Thursday, 5 November 2026

28న ఢిల్లీలో దీక్ష చేసే యోచన : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు వ్యవహరించాలని ఈ నెల 26న అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు  చేపట్టాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. ఈ ఉదయం ఐకాస స్టీరింగ్‌ కమిటీ భేటీ అయింది. కేంద్రం నిర్వహించే అఖిలపక్ష భేటీకి తాను హాజరుకాకూడదని భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అఖిలపక్ష భేటీకి ఒక్క రోజు ముందు ఇందిరాపార్కు వద్ద భారీ దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. 28న ఢిల్లీలో దీక్ష చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *