Tuesday, 3 November 2026

28 న మెడికల్‌ దుకాణాలు తెరిచే ఉంటాయి’

హైదరాబాద్గ్రేటర్‌ పరిధిలోని మెడికల్‌ దుకాణాలు 28న తెరిచే ఉంటాయని, బంద్‌ పిలుపుతో తమకు సంబంధం లేదని గ్రేటర్‌ హైదరాబాద్‌ రిటైల్‌ మెడికల్‌ దుకాణాల అసోసియేషన్‌ తెలిపింది. ప్రజలకు ఇబ్బంది కలిగే అత్యవసర సేవాలకు అంతరాయం కలిగించమని అసోసియేషన్‌ అధ్యక్షుడు రంగ రవీందర్‌ గుప్తా అన్నారు. బుధవారం సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్‌ గుప్తా, అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.కిషన్‌, కోశాధికారి శ్రీధర్‌, సభ్యులతో కలిసి మాట్లాడారు. గ్రేటర్‌ పరిధిలో సుమారు 8 వేల దుకాణాలు ఉన్నాయన్నారు. తమ సమస్యలపై ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ను కలిసి వినతి పత్రం ఇవ్వడంతో పాటు వాటిపై చర్చించామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు సుభాష్‌ గౌడ్‌, రాజేందర్‌ జగత్‌, లక్ష్మణ్‌, కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *