బెల్లంపల్లి, మార్చ్ 25, (జనంసాక్షి )
జనహిత సేవా సమితి ఆరవ వార్షికోత్సవం సందర్భంగా మయూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాల సహకారం తో బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో ఈనెల 29న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుందని జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ తెలిపారు. వైద్య శిబిరంలో భాగంగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన బీపీ, షుగర్, రక్తపరీక్షలు, ఈసీజీ సేవలు అందించి అవసరమైన మందులు ఉచితంగా అందజేయబడుతుందన్నారు. ఈ మెగా వైద్య శిబిరం లో వైద్యులు గోపాలకృష్ణ, కార్డియాలజీ లండన్ గుండె వైద్య నిపుణులచే పరీక్షించబడును. జనరల్ ఫిజిషియన్ వైద్యులు, గైనకాలజిస్ట్ స్త్రీల వైద్య నిపుణురాలు, ఎంఎస్ ఆర్తోపెడిక్ ఎముకల వైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించనున్నమన్నారు. సదావకాశాన్ని బెల్లంపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య శిబిరం కొరకు మరిన్ని వివరాలకు 9866024576, 9032721143, 9866293007 జనహిత సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి నెంబర్లని పోన్ నెంబర్లని సంప్రదించాలన్నారు.
29న ఉచిత మెగా వైద్య శిబిరం.




