ఖమ్మం: జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి వాగుపై పది అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. వాగు ఉద్ధృతికి వాజేడు మండలంలోని 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి గొల్లపాడుకాలువ పొంగి ప్రవహిస్తోంది. దీంతో సుందరయ్యనగర్, మంచికంటినగర్ కాలనీల్లోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.




