Tuesday, 3 November 2026

30,000 రూపాయలు ఖర్చు చేసి అంబేద్కర్ విగ్రహానికి ఎస్ ఎస్ రేలింగ్ చేయించిన వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ -వడ్ల నందు

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ మే 02( జనం సాక్షి)వికారాబాద్ మండలంలో ఎర్రవల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి రేలింగ్ ఏర్పాటు చేయించిన  వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందువికారాబాద్: వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి 30000 రూపాయలు ఖర్చు చేసి రేలింగును ఏర్పాటు చేయించడం జరిగిందని వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్న నేపథ్యంలో విగ్రహం చుట్టూ సరైన విధంగా రేలింగు ఏర్పాటు చేయించాలని గ్రామస్తుల కోరిక మేరకు తాను  ముందుకు వచ్చి వడ్లనందు  ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఎవరు ఏటువంటి సహాయం కావాలంటే ఆసహాయం చేస్తానని ఆయన తెలిపారు.