Tuesday, 3 November 2026

తెలంగాణకు ఆర్టికల్‌ 371-డి వర్తించదు: కె.కేశవరావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆర్టికల్‌ వర్తించదని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె. కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు చేయాలంటే రాజ్యంగ సవరణ అవసరమని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. దిగ్విజయ్‌సింగ్‌కు అవగాహన లేకుంగా రాజ్యంగ సవరణ ప్రస్తావన తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్‌ ఏర్పాటు చేసినప్పుడు 371-డి వర్తించలేదని ఆయన గుర్తు చేశారు. దిగ్విజయ్‌సింగ్‌ బిజినెస్‌, బ్యాంకు లోన్ల గురించి మాట్లాడకుండ రాజ్యంగ సవరణ ప్రస్తావన తెచ్చారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకుంటారని కాంగ్రెస్‌ ఇవ్వక పోతే ఆ పార్టీ అంత పిచ్చిది మరోటి లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *