3800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని స్థానిక బస్టాండు వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చెయ్యడం జరిగింది…
జనం సాక్షి :(కొండమల్లేపల్లి ) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొండమల్లేపల్లి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 3800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని స్థానిక బస్టాండు వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చెయ్యడం జరిగింది…
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త అఖిల్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని అనగతొక్కుతూ ఈరోజు ప్రభుత్వము విద్యార్థులతో చెలగటం ఆడుతుందాని ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నాకానీ ఇప్పటివరకు 3800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం సిగ్గుచేటు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యార్థులకు అండగా నిలబడి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి ప్రభుత్వ గద్దె దించుతామని ఆయన హెచ్చరించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో:- నగర కార్యదర్శి ఆకాష్ ఉప కార్యదర్శి ప్రవీణ్ మహేష్ కార్యకర్తలు అనిల్ అరవింద్ శివ సునీల్ తదితరులు పాల్గొన్నారు