Tuesday, 3 November 2026

48 అడుగులకు క్రమంగా తగుతున్న గోదావరి నది

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేసి తగ్గుతోంది. ఈ ఉదయం 8 గంటలకు భద్రాచలం వద్ద 48.1 అడుగులకు తగ్గింది. అధికారులు ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 47.9 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించి మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తారు. రామాలయం వద్ద కరకట్ట స్లూయిజ్‌ లీకుతో చేరిన వరద నీరు క్రమేసి తగ్గుతోంది. మూడు రోజులుగా రామాలయం సమీపంలోని ఇళ్లు, దుకాణాలు వరద నీటిలో ఉన్నాయి. రాజకీయనాయకులు ప్రచారం కోసం వస్తున్నారే తప్ప తమను పట్టించుకోవడంలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ఉద్ధృతి తగ్గడంతో మండలంలోని పలుగ్రామాలకు రాకపోకలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మరికొన్ని గ్రామాలు ఇప్పటీకీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *