హైదరాబాద్: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన లక్డీకాపూర్లో ట్రాఫిక్ ఇబ్బందులకు మోక్షం లభించనుంది. లక్డీకాపూర్లో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్డి (ఇర్వోబీ)ని శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఇక్కడ ఉన్న బ్రిడ్డికి అదనంగా మరొకటి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్వోబీ నిర్మాణానికి రూ.26.10 కోట్లకు పరిపాలన పరమైన అనుమతులను ఇస్తూ ప్రభుత్వం 2011 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం అర్హులైన గుత్తేదారుల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు పనులను ఎం. వెంకటరావు ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. రైల్వే ప్రాంతాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం ఆ శాఖకు రూ. 9.14 కోట్లను మంజూరు చేసింది. వీటితోపాటు వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వం మొత్తం రూ.24.75 కోట్ల నిధులను ఆర్వోబీ నిర్మాణానికి ఖర్చు చేసింది. మొత్తం 189 మీటర్ల బ్రిడ్డి పొడవుతోపాటు, అప్రోచ్‌తో నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి ఆర్వోబీని 5వ తేదీనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ముఖ్యమంత్రి అత్యవసరంగా ఢిల్లీ వెళ్లడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. దీంతో శుక్రవారం ఈ బ్రిడ్డిని ప్రారంభించనున్నారు.




