Tuesday, 3 November 2026

5 నుండి 9వరకు బాలలవారోత్సవాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 3 : ఈ నెల 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా బాలభవన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి 9 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్‌ వి.ప్రభాకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పోటీలలో పాల్గొన దలచిన విద్యార్థుల జాబితాను ఈ నెల 4 ఆదివారం సాయంత్రం 5 గంటల్లోపు అందించాలని చెప్పారు. పాఠశాల నుంచి ఒక్కో అంశంలో జూనియర్స్‌ విభాగంలో ఐదుగురు, సీనియర్స్‌ విభాగంలో ఐదుగురు విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. ఏడో తరగతి వరకు విద్యార్థులను జూనియర్స్‌గా, ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులను సీనియర్స్‌గా పరిగణిస్తామని తెలిపారు. ఈ నెల 5న చెస్‌, టేబుల్‌ టెన్నిస్‌, ఎంబ్రాయిడరీ, 6న వ్యాసరచన, పెయింటింగ్‌, 7న ఉపన్యాసం, శాస్త్రీయ నృత్యం, 8న విచిత్ర వేషాధారణ, బెస్ట్‌ అవుటాప్‌ వేస్ట్‌, దేశభక్తి, జానపద నృత్యం, 9న లలిత సంగీతం, మెమోరీటెస్టు, రంగోలి ఉంటాయన్నారు. విజేతలకు 14న రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో జరిగే బాలల దినోత్సవం రోజు బహుమతులు అందిస్తామని , వివరాలకు 08462-225503 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *