Tuesday, 3 November 2026

ప్రపంచ అంధుల దినోత్సవం సందర్భంగా 5కె రన్‌

ఖైరతాబాద్‌(హైదరాబాద్‌): ప్రపంచ అంధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘మిణుగురులు’ చిత్ర బృందం ఆధ్వర్యంలో 5కె వాక్‌ నిర్వహించారు. అంధులకు తోడ్పాటునివ్వాలనే ఆశయంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. రస్పెక్ట్‌ క్రియేషన్స్‌ అధినేత అయోధ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నిర్మాత గున్నం గంగరాజు ముఖ్య అతిథిగా హాజరై వాక్‌ను ప్రారంభించి జలవిహార్‌ వరకు అంధులతో కలిసి వాక్‌లో పాల్గొన్నారు. అనంతరం అంధ యువతీ, యువకులు సంగీత ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ బ్లైండ్‌ సభ్యులు శ్రీనివవాస్‌, వాసర్‌ ఐ కేర్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *