Tuesday, 3 November 2026

భాజపాకు మద్దతు కూడగడుతున్న అమెరికాలోని భారతీయులు

ఇంటర్‌నెట్‌డెస్క్‌ , హైదరాబాద్‌ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను గెలిపించడమే లక్ష్యంగా అమెరికాలోని నివసిస్తున్న భారతీయుల్లో కొంతమంది ‘ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ భాజపా’గా ఏర్పడి పంపిస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఉన్న వాలంట్రీలంతా ఒక్కొక్కరు 200 మందికి ఫోన్‌ చేసి భాజపాకు మద్దతు కూడగడుతున్నట్లు ‘ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ భాజపా’ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పటేల్‌ తెలిపారు. భాజపాకు 272 లోక్‌సభ స్థానాలు సంపాదించడంతో పాటు నరేంద్ర మోడీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయడానికి వేలాది మంది కార్యకర్తలు ముందుకొస్తున్నారని పటేల్‌ తెలిపారు. వీరంతా అమెరికాలో వివిధ రంగాల్లో పని చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *