హైదరాబాద్ : గొర్రెల మందపై వీధి కుక్కలు స్వైర్య విహారం చేశాయి . రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం ఇనామ్‌గూడలో యాట కృష్ణయ్యకు చెందిన 150 గొర్రెలపై బుధవారం రాత్రి వీధి కుక్కలు దాడి చేశాయి.ఈ దాడిలో 50గొర్రెలు మృతి చెందగా,మరో 50 గొర్రెల ఆచూకీ తెలియడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.




