Tuesday, 3 November 2026

వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ ధర్నా

హైదరాబాద్‌ : భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సచివాలయంలోని సీ -బ్లాక్‌ వద్ద ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు రాష్ట్ర విభజనపై చూపిన శ్రద్ద రైతులపై చూపడం లేదని టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. సీఎం సమీక్షలతో సరిపెడుతున్నారు. తప్ప రైతులను ఆదుకోవడం లేదన్నారు. సీ-బ్లాక్‌ వద్ద బైఠాయించిన తెదేపా ఎమ్మెల్యేలందరిని పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *