వాజేడు: ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో గోదావరి వరద వేగంగా పెరుగుతోంది. పేరూరు వద్ద శుక్రవారం ఉదయానికి 55అడుగులు దాటింది. మండల కేంద్రానికి వెళ్లే రహదారిపై వరద నీరు చేరడంతో వాజేడుతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో మండలంలోని 34 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లి గ్రామంలో ఓ గిరిజనుడి ఇల్లు కుప్పకూలింది. పెదగొల్లగూడెం, గుమ్మడిదొడ్డి, దూలాపురం, చీకుపల్లి, నాగారం గ్రామాలకు చెందిన దాదాపు 140 మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.




