Tuesday, 3 November 2026

భారీ వర్షం కారణం వల్ల చిలిచిన రాకపోకలు

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 58 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం డివిజన్‌లోని 8 మండలాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. వాజేడు మండలంలోని 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు- వెంకటాపురం-చర్ల మండలాల మధ్య రాకపోకలు స్తంభించాయి. వెంకటాపురం మండలంలో 15 ఇళ్లు నీట్టమునిగాయి. చింతకూరు మండలంలో 35 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చర్ల మండలంలో 4 గ్రామాలు జలగ్బంధంలో చిక్కుకోవడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. తాలిపేరు ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కూనవరంలో మూడు కాలనీల్లోకి వరద నీరు చేరింది. వేలేరుపాడు మండలం ఎడవల్లి వద్ద ఎద్దువాగు ఉద్ధృతికి 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *