హైదరాబాద్ : టీఆర్‌ఎస్ తెలంగాణ కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత ,మాజీ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు అన్నారు. అందుకే ఉద్యమ పార్టీలో తాను చేరాలను కుంటున్నానని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. కాంగ్రెస్‌కు తెలంగాణపై ఏ మాత్రం చిత్తశుద్ది లేదని అందుకే తెలంగాణను మరిచి పోయిందని ,ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశం పరిష్కరించకుండా హైకమాండ్‌తో చర్చించే సమస్యలేదని ఆయన తేల్చిచెప్పారు.తాను ఏపని చేసిన ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ కోసమే పని చేస్తానని పదవుల కోసం పాకులాడనని చెప్పారు.
టీఆర్‌లో చేరాలనుకుంటున్నా : కేకే




