60వ రోజు వీఆర్ఏ ల నిరవధిక సమ్మెను

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్22 రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ కమిటీ మేరకు నిరవధిక సమ్మె 60వ రోజు భాగంగా ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు సెప్టెంబర్ 9- 2020 నాడు రాష్ట్రంలో ఉన్న విఆర్ఎల అంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని గ్రహించి వీరందరికీ పే స్కేల్ జీవో అమలు చేస్తానని అర్వత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇస్తానని 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగం ఇస్తానని ప్రకటించి రెండు సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు అమలు కాకపోవడం బాధాకరంగా మిగిలింది సీఎం కేసీఆర్ సార్ గారు ఇప్పటికైనా మా బాధలను అర్థం చేసుకొని మీరు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కోరుతున్నాము. ఇట్టి కార్యక్రమంలో జహీరాబాద్ డివిజన్ ఉపాధ్యక్షులు మరియు రాయికోడు మండల అధ్యక్షులు జిపి రత్నం ఉపాధ్యక్షులు శివకుమార్ కార్యదర్శి శ్రీశైలం సలహాదారు గోపాల్ కోశాధికారి లక్ష్మీ. బి లక్ష్మి ఎస్ సుజాత దుర్గన్న అశోక్ వీరేందర్ బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు