Tuesday, 3 November 2026

వైభవంగా జరుగుతున్న ఎల్లమ్మ కల్యాణోత్సవం

ఎస్‌.ఆర్‌.నగర్‌ (హైదరాబాద్‌): బల్కంపేట ఎల్లమ్మ వారి కల్యాణం వైభవంగా జరుగుతుంది. శాస్త్రోక్తంగా మంగళవాయిద్యాల మధ్య వేద పండితులు కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. నగరం నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, కార్పొరేటర్‌ ఎస్‌.శేషుకుమారి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పించి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఏర్పాట్లను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. విజయరాజు పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *