హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్ నగరంలో బోనాలు, రంజాన్ పండుగ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఇవాళ ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలు చోటు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటాయన్నామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సాధ్యమైనంత వరకు అందరినీ సమన్వయం చేసుకుని పని చేస్తామన్నారు. బుద్ధగయ పేలుళ్లు జరిగిన అనంతరం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం నుంచి తమకు సమాచారం ఇచ్చిందని పేర్కొన్నారు




