శంషాబాద్, హైదరాబాద్: రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చి శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి శంషాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుని ప్రత్యేక రైలులో బీదర్‌కు బయల్దేరారు. ఆయన బీదర్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చినట్లు సమాచారం. హైదరాబాదులో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రైల్వే శాఖ సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.




