Tuesday, 3 November 2026

కుటుంబ పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నా: బొత్స

హైదరాబాద్‌: విడిపోతాం అనేవారిని కూడా కలిసి ఉండాలని చెబుతూ కుటుంబ పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సమైక్య, విభజనకు సంబంధించి అధిష్ఠానం నివేదిక కోరిందని, నివేదిక కోసం కసరత్తు జరుగుతు నిర్ణయానికి కాంగ్రెస్‌ నేతలు కట్టుబడి ఉండాలని కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మంత్రి బొత్సను కలిసినట్లు మంత్రి శైలజానాథ్‌ తెలిపారు. తమ అభిప్రాయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని బొత్స హామీ ఇచ్చినట్లు శైలజానాథ్‌ తెలిపారు. ఉపముఖ్యమంత్రిని కూడా కలిసి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *