Tuesday, 3 November 2026

వాతావరణం కారణంగా విమాన సర్వీసులు రద్దు

హైదరాబాద్‌: వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌-గన్నవరం మధ్య విమానసర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఈ రోజు ఉదయం 68 మంది ప్రయాణికులతో స్పైన్‌జెట్‌, 34 మంది ప్రయాణికులతో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు శంషాబాద్‌ నుంచి గన్నవరం వెళ్లాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటం, మరోవైపు ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రెండు విమానాలు తిరుగుముఖం పట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *