Tuesday, 3 November 2026

బంగారం దుకాణంలో భారీ చోరీ

ఎస్‌. రాయవరం: విశాఖజిల్లా ఎస్‌. రాయవరం మండలం అడ్డరోడ్డులో ఉన్న ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. లంక రామశేషుకు చెందిన సాయితేజ జ్యూలరీస్‌లో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 40 కేజీల వెండి, 85 వేల నగదు, బంగారు అభరణాలు అపహరించారు. దుండగులు ముందుగా వ్యాపార కూడలిలోని ఓ వెల్డింగు దుకాణం నుంచి గ్యాస్‌ కట్టర్‌, గ్యాస్‌ సిలిండర్‌ దొంగిలించి వాటితో బంగారం దుకాణం షట్టర్‌ కత్తిరించి చోరీకి పాల్పడ్డారు. ఎస్సై అప్పలనాయుడు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. బుధవారం రాత్రి ఈ ప్రాంతంలో పోలీసు గస్తీ ఉన్నప్పటికీ చోరీ జరగడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *