ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు

విజయవాడ: విజయవాడలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా గన్నవరం విమానాశ్రయానికి రాకపోకలు కూడా నిలిచిపోయాయి.