హైదరాబాద్: తెలంగాణను అడ్డుకునే కుట్రల జరుగుతున్నాయని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజమండ్రి సభలో ఎంపీ ఉండపల్లి చేసిన వ్యాఖ్యలను హరీశ్‌రావు ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే దేశంలో ప్రాంతీయ ఉద్యమాలు వూపందుకుంటాయని చేస్తున్న ప్రచారంలో అర్థం లేదన్నారు.




