హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలంగాణ విద్యార్థి లోకం మరోసారి కథం తొక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిన్నటి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ నేతల ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు ఇవాళ గాంధీభవన్‌ను ముట్టడించారు. దీంతో గాంధీభవన్ వద్ద తీవ్ర ఉధ్రిక్తత ఏర్పడింది. పోలీసులు విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.




