ఖమ్మం,(జనంసాక్షి): కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడ గోదావరి నీటిమట్టం ఈ ఉదయం 6 గంటలకు 33.3 అడుగులకు చేరింది. మరోవైపు డివిజన్లలో పలువాగులు పొంగిపోర్లుతుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.




