విజయవాడ,(జనంసాక్షి): రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణనదిలో వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద శనివారం నీటిమట్టం 11.9 అడుగులకు చేరుకుంది. అయితే కృష్ణ నదిలో పూర్తి స్థాయి నీటి మట్టం 12 అడుగులు. దాంతో అధికారులు 402 క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే కృష్ణ నదిలో ఇన్‌ఫ్లో 400 క్యూసెక్కులు అని అధికారులు తెలిపారు.




