దమ్మపేట(ఖమ్మం): యువకుడిని తీవ్రంగా కొట్టాడని అరోపిస్తూ దమ్మపేట ఎస్.ఐ. అశోక్‌కుమార్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఇటీవల నల్లగుంట గ్రామానికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. విచారణ పేరుతో ఎస్.ఐ. మృతుడి అన్న నాగును శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టాడని గ్రామస్థులు అరోపిస్తున్నారు. దీంతో అదివారం ఉదయం గ్రామస్థులంతా బాధితుడిని తీసుకొచ్చి దమ్మపేట తీసుకొచ్చి ఎస్.ఐ. వాహనానికి అడ్డుపడి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఎస్.ఐ.ను నిలదీశారు. ఉన్నతాధికారులు స్పందించి ఎస్.ఐ. పై చర్యలు తీసుకునే వరకు అందోళన విరమించేది లేదని గ్రామస్థులు స్పష్టం చేశారు.




