షెరింగ్‌ తాజ్‌గేకు అభినందనలు తెలిపిన మన్మోహన్‌

థింపూ: భూటాన్‌ ఎన్నికల్లో ప్రతిపక్షం పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ విజయం సాధించడంతో భూటాన్‌ ప్రధానిగా షెరింగ్‌ తాబ్‌గే ఎన్నికయ్యారు. తాబ్‌గేకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. భూటాన్‌కు అన్ని విధాల సహరిస్తామని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.