నాగర్‌కర్నూలు గ్రామీణం: మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కుర్నూలు సబ్ జైలు నుంచి పుట్ట శ్రీను అనే రిమాండ్ ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలకపల్లి మండలానికి చెందిన శ్రీనును పలు విగ్రహాల ధ్వంసం కేసులో ఏప్రిల్ 15న నాగర్‌కర్నూల్ సబ్ జైలుకు తరలించారు. ఆదివారం సాయంత్రం అతను పోలీసుల కన్నూగప్పి జైలు నుంచి పరారయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.




