నిజామాబాద్: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఓట్ల కోసం అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వారిని సైతం చేతులపై ఎత్తుకుని వచ్చి ఓట్లు వేయిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు సైతం ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దర్పల్లిలో అభ్యర్థులు, ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అధికారులు అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో ఎన్నికల కేంద్రాన్ని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ హర్షవర్ధన్
పరిశీలించారు. ఆర్మూరు, నిజామాబాద్ మండలాల్లో ఉదయం 9గంటల వరకూ 25శాతం పోలింగ్ నమోదైంది.




