Tuesday, 3 November 2026

గడ్డన్న ప్రాజెక్టుకు వరదనీటి పోటు

బైంసా: పట్టణ సమీపంలోని గడ్డన్న ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదనీరు ప్రాజెక్టులో కలుస్తుంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 357.7మీటర్లకు చేరింది. ప్రాజెక్టు అధికారులు వెంటనే ఏడు వరద గేట్లను 0.5 మీటర్లు పైకి ఎత్తి 15000 క్యూసెక్కుల నీటిని సిద్ధవాగులోకి వదిలివేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు నీటిరాక 12000 క్యూసెక్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో బైంసా, బాసర మార్గంలో బైంసా వంతెనకు పై నుంచి వరద నీరు ప్రవహించే ప్రమాదం ఉడటం వల్ల రాకపోకలు నిలిపివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *