Tuesday, 3 November 2026

తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట విద్యార్థుల ధర్నా

నెన్నెల (ఆదిలాబాద్‌): నెన్నెల మండల కేంద్రంలోని ఎస్సీ వసతిగృహం విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. తమ వసతి గృహంలో పూర్తిస్థాయి వార్డెన్‌లేక సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కనీసం వంట మనిషి కూడా లేకపోవడంతో భోజనం తయారు చేసేందుకు తీవ్ర ఇబ్బందులకు గరౌతున్నట్లు చెప్పారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *