Tuesday, 3 November 2026

ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌: చెదురు మదురు ఘటనలు మినహా తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కడపజిల్లాలో కొన్ని చోట్ల వైకాపా, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చిత్తూరు జిల్లా వేదాంతపురం పోలింగ్‌ కేంద్రం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు బ్యాలెట్‌ బాక్సులో ఇంకుపోయడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశం జిల్లా గోగినేనివారిపల్లెలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట లోపు క్యూలో నిల్చున్న వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్లలెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత వార్డు సభ్యుల ఓట్లు, తర్వాత సర్పంచి అభ్యర్థుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాలను కూడా ఈరోజు సాయంత్రమే విడుదల చేస్తారు. గుంటూరు జిల్లాలో 70శాతం, విశాఖలో 62, మెదక్‌ జిల్లాలో 71శాతం, రాజమండ్రిలో 78శాతం, రంపచోడవరంలో 65శాతం పోలింగ్‌ నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *