Tuesday, 3 November 2026

బొత్స ప్రకటన హాస్యాస్పదం: యనమల

హైదరాబాద్‌: రాష్ట్రంలో 1038 పంచాయతీలను కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవంగా గెలిచినట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స చేసిన ప్రకటన మాజీ ముఖ్యమంత్రి అంజయ్య ప్రకటనను పోలి ఉందని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అప్పట్లో 11 ఏళ్లపాటు ఎన్నికలు నిర్వహించని అంజయ్య ఆతర్వాత గెలిచిన వారంతా కాంగ్రెస్‌ వారేనని ప్రకటించి అపహాస్యంపాలైనట్లు ఇప్పుడు బొత్స ప్రకటన ఉందని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *