Tuesday, 3 November 2026

ఘనంగా జరుగుతున్న తిలక్‌ జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌: స్వాతంత్ర సమరయోధుడు బాల గంగాధర్‌ తిలక్‌ 157వ జయంతిని పలువురు నేతలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. కోఠి కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి తెదేపా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో పాటు విశ్వహింద్‌ పరిషత్‌ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో తిలక్‌ కీలకంగా వ్యవహించారని, పదవులు ముఖ్యం కాదని సమాజసేవ ముఖ్యమని చెప్పిన మహావ్యక్తి తిలక్‌ అని నేతలు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *