Tuesday, 3 November 2026

ప్రారంభంకానున్న ఆగస్టు మొదటి వారంలో ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్‌

విశాఖ: విశాఖవాసులను గత రెండేళ్లుగా వూరిస్తున్న ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్‌ను ఆగస్టు మొదటి వారంలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను మంత్రి మంగళవారం పర్యవేక్షించారు. ఫ్లైఓవర్‌ నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు దాదాపు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ప్రస్తుత ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఆగస్టు మొదటి వారంలో ఫ్లైఓవర్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా విశాఖ రానున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేతల మీదుగా దీన్ని ప్రారంభిస్తామన్నారు. భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతో కలిపి నగర జనాభా 20లక్షలకు చేరుకుంటున్న తరుణంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *