Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ బయల్దేరిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): హస్తిన పర్యటన ముగించుకున్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ శనివారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. రాష్ట్ర విభజన ఖాయయనే సంకేతాల నేపథ్యంలో ఆయనకు తెలంగాణ జేఏసీ నేతలు శంషాబాద్‌ విమానాశ్రయంలో  ఘన స్వాగతం పలికేందుకు సన్నహాలు చేస్తున్నారు.

సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న దామోదర పలువురు పార్టీ సీనియర్‌ నేతలతో చర్చలు జరిపారు. అధిష్ఠానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ప్రకటిస్తే దాన్ని అడ్డుకొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలను,
సమైక్య రాష్ట్రాన్నే కొనసాగించాలని కోరుతూ సీఎం లేవనెత్తుతున్న సందేహాలను నివృత్తి చేసే కొన్ని నివేదికలను అందజేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *