కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండలం ఉంగుటూరు గ్రామపంచాయతీకి సంబంధించిన లెక్కింపు కేంద్రాన్ని మార్చాలని గ్రామస్థులు డిమాండు చేశారు. గ్రామంలో వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న రెండు పాఠశాలల్లో ఎన్నికలు జరిగాయి. ఒక చోట 10 వార్డులకు, మరో చోట రెండు వార్డులకు ఎన్నికలు జరిగాయి. రెండు వార్డులు ఎన్నికలు జరిగిన చోటే లెక్కింపు కేంద్రాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించడంతో గ్రామస్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.




