హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యుత్‌సౌధ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ వాళ్లు కార్యాలయం ప్రాంగణంలో ధర్నాకు దిగారు. జైతెలంగాణ నినాదాలతో విద్యుత్ సౌధ పరిసరాలు హోరెత్తాయి. సీఎం కిరణ్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తన దృక్పతాన్ని మార్చుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు.




